ఉత్తర గుజరాత్లో కాంగ్రెస్‌దే పైచేయి
తిరుగుబాట్లతో బీజేపీ సతమతం.. ఆప్ ఉనికి అంతంతే!
గుజరాత్లో తొలిదశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 60.20 శాతం పోలింగ్
నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.
అహ్మదాబాద్ : గుజరాత్ ఉత్తర ప్రాంతం బీజేపీకి గట్టి సవాల్ విసురుతోంది.
ఓబీసీల ప్రాబల్యం అధికంగా ఉండే ఈ ప్రాంతంలో బనస్కాంత, పటన్, మెహసానా,
సబర్కాంత, ఆరావళి, గాంధీనగర్ జిల్లాల పరిధిలో 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఈ నెల 5న పోలింగ్ జరగనుంది. గత రెండు దఫాలుగా ఇక్కడ కాంగ్రె్‌సదే పై చేయి.
2012, 17 ఎన్నికల్లో ఆ పార్టీ 17 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 2012లో 15
స్థానాల్లో గెలిచింది. 2017లో 14 మాత్రమే వచ్చాయి. బలంగా ఉన్న కొన్ని
నియోజకవర్గాల్లో బీజేపీకి నేతల తిరుగుబాట్లు తలనొప్పిగా తయారయ్యాయి. ప్రధానంగా
అంజనా చౌధురి సామాజిక వర్గం ఆ పార్టీపై ఆగ్రహంతో ఉంది. దీనికి ప్రధాన కారణం
మాజీ హోంమంత్రి విపుల్ చౌధురిని అరెస్టు చేయడమే. 2005-16 నడుమ డెయిరీ
చైర్మన్‌గా ఉన్నప్పుడు రూ.800 కోట్ల అవినీతి జరిగిందని ఏడేళ్ల తర్వాత ఆయనపై
ఫిర్యాదు అందింది. దీంతో ఏసీబీ ఈ ఏడాది సెప్టెంబరు 15న ఆయన్ను అరెస్టు
చేసింది. ఇంతవరకు ఆయనకు బెయిల్ రాలేదు. సొంత పార్టీ ప్రభుత్వమే విపుల్‌ను
అరెస్టు చేయడాన్ని అంజనా చౌధురి సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఈ వర్గం
ప్రజలు ఉత్తర గుజరాత్లో కనీసం 30 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారు. 1,253
గ్రామాలకు చెందిన 2 లక్షల మంది ‘అర్బుద సేన’ పేరుతో గత నెలలో గాంధీనగర్‌లో
చార్దా గ్రామంలో భారీ సభ పెట్టి తమ సత్తా చాటుకున్నారు. అర్బుద సేనను విపుల్
చౌధురే గత ఏడాది ఏర్పాటు చేశారు. ఇది రాజకీయేతర సంస్థ అయినా ఎన్నికల్లో
కచ్చితంగా ప్రభావం చూపుతుందని విపుల్ వర్గీయులు బీజేపీకి సహకరించడం లేదని
విశ్లేషకులు అంటున్నారు. విపుల్ సన్నిహితులు కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ
(ఆప్)లో చేరాలని భావించారు. అయితే అవినీతి ఆరోపణలతో అరెస్టయిన విపుల్‌ను
పార్టీలో చేర్చుకోవడానికి కేజ్రీవాల్ జంకారు. పైగా ఉత్తర గుజరాత్లో ఆప్
ఉనికి పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ
ఉంటుందంటున్నారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ 11 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు
మళ్లీ టికెట్లు ఇవ్వగా, బీజేపీ ఆరుగురికే అవకాశం ఇచ్చింది. మిగతా స్థానాల్లో
కొత్తవారిని బరిలోకి దించింది. పాటీదార్, కోలీ సామాజిక వర్గాల ప్రాబల్యం కూడా
ఈ ప్రాంతంలో ఎక్కువే. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్‌కు
గాంధీనగర్ దక్షిణ సీటును బీజేపీ కేటాయించింది. గత ఎన్నికల్లో ఆయన పటన్
జిల్లా రాధన్‌పూర్ నుంచి గెలిచారు. 2019లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి
బీజేపీ తరఫున పోటీ చేసి ఉప ఎన్నికలో ఓడిపోయారు.
కాంగ్రెస్.. ఆటంకవాది!
ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజం
‘‘కాంగ్రెస్ ఆటంకవాది. ప్రతి పనినీ ఆలస్యం చేయడం, ప్రజలను తప్పుదోవ
పట్టించడమే ఆ పార్టీ విధానం.’’ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు
గుప్పించారు. శుక్రవారం గుజరాత్ రెండో దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన
బనాస్కంత జిల్లాలో కాంక్రేజ్ గ్రామంలో బీజేపీ నిర్వహించిన సభలో ప్రసంగించారు.
ప్రజల కోసం చేపట్టిన సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణానికి కాంగ్రెస్
అడ్డుపడిందని దుయ్యబట్టారు. ‘‘బీడువారిన భూములను సస్యశ్యామలం చేసేందుకు నర్మదా
నది నీటిని తరలించాలన్న స్పృహ వారికి రాలేదు. కేవలం అవినీతి, ముడుపులకు
ఆస్కారం ఉన్న పనులే వారికి కనిపించాయని ప్రధాని నిప్పులు చెరిగారు. ఇక్కడి
ప్రజల గొంతు ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే. ఎన్నికల సమయంలో ఈ
విషయాన్ని అస్సలు మరిచిపోవద్దని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
తొలి దశలో ఓటింగ్ 63.14%
గుజరాత్లో తొలి దశ ఎన్నికల్లో 63.14% పోలింగ్ నమోదైనట్లు ఈసీ శుక్రవారం
ప్రకటించింది. 2017లో జరిగిన మొదటి విడతలో 66.75 శాతం పోలింగ్ నమోదైంది. ఈ
దఫా దాని కంటే 3.61 శాతం తగ్గడం విశేషం. 78.24% పోలింగ్‌తో నర్మద జిల్లా అగ్ర
స్థానంలో నిలిచింది. తాపీ జిల్లాలో 76.91%, నవ్సారీలో 71.06% ఓటింగ్
నమోదైంది. బోటాద్ జిల్లాలో అతి తక్కువగా 57.58%, అమ్రేలీలో 57.59% ఓటింగ్
జరిగినట్లు ఈసీ వెల్లడించింది.