పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోల్ కతాలోని హుక్కా బార్ల
పై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది. ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం
చూపుతుండటంతో తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోల్ కతా
మేయర్ ఫిర్హాద్ హకీమ్ తెలిపారు. హుక్కా బార్లు నిర్వహిస్తున్నట్టు తెలిస్తే
ఆయా రెస్టారెంట్ల లైసెన్స్ లను రద్దు చేస్తామని హెచ్చరించారు. హుక్కాకు యువతను
బానిసలుగా మార్చేందుకు అందులో కొన్ని మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్టు
అధికారులకు ఫిర్యాదులు అందాయని.. వీటిని మూసివేయాలంటూ అభ్యర్థనలు రావడంతో తాము
ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. హుక్కాలో వాడే రసాయనాలు ఆరోగ్యానికి
అత్యంత హానికరమైనందు వల్ల రెస్టారెంట్లన్నింటిలోనూ హుక్కా బార్లు మూసివేయాలని
ఆదేశించారు. పోలీసుల సహకారంతో అధికారులు ఈ నిషేధాన్ని
అమలుపరుస్తారని మేయర్ చెప్పారు.