మణిపూర్ సంగై ఉత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వీడియో సందేశం ద్వారా
ప్రసంగించారు. రాష్ట్రంలో గొప్ప పండుగగా పేరుపొందిన మణిపూర్ సంగై ఉత్సవం
మణిపూర్ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించడంలో సహాయపడుతుందని
ప్రధాని పేర్కొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి
ప్రసంగిస్తూ.. మణిపూర్ సంగై ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు
మణిపూర్ ప్రజలను అభినందించారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం
తర్వాత ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. దీనికి భారీ స్థాయిలో ఏర్పాట్లు
చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంగై మణిపూర్ రాష్ట్ర జంతువు మాత్రమే కాదు,
భారతదేశ విశ్వాసం. దీనికి విశ్వాసాలలో కూడా ప్రత్యేక స్థానం ఉంది. సంగై ఉత్సవం
భారతదేశ జీవవైవిధ్యాన్ని కూడా జరుపుకుంటుంది” అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది
ప్రకృతితో భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను కూడా జరుపుకుంటుందని ఆయన
అన్నారు. ఈ పండుగను నిర్వహించేందుకు మణిపూర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎన్
బీరెన్ సింగ్ చేసిన కృషి, సమగ్ర దృక్పథాన్ని ప్రశంసిస్తూ ప్రధాన మంత్రి
వ్యాఖ్యానించారు.