న్యూఢిల్లీ : భారత్‌లో అమ్మాయిల కంటే అబ్బాయిలే అధికంగా కేన్సర్ బారిన
పడుతున్నారని లాన్సెట్ తాజా నివేదిక వెల్లడించింది. సమాజంలో లింగ వివక్షే
దీనికి కారణమై ఉండవచ్చునని అభిప్రాయపడింది. దేశంలో జనవరి 1, 2005 నుంచి
డిసెంబర్ 31, 2019 మధ్య మూడు కేన్సర్ ఆస్పత్రులతో పాటు ఢిల్లీలోని
పాపులేషన్ బేస్డ్ కేన్సర్ రిజిస్ట్రీ (పీబీసీఆర్), మద్రాస్
మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రరీల నుంచి రికార్డుల్ని సేకరించి ఈ నివేదిక
రూపొందించారు. పీబీసీఆర్‌లో 11 వేలు, ఇతర ఆస్పత్రిల్లోని 22 వేల క్యాన్సర్
రోగుల్లో అబ్బాయిల సంఖ్యే అధికంగా ఉందని ఎయిమ్స్ ప్రొఫెసర్ సమీర్ బక్షీ
చెప్పారు.
భారత్‌లో అబ్బాయిల్లోనే ఎక్కువగా క్యాన్సర్ గుర్తింపు : భారతదేశంలో
క్యాన్సర్ వ్యాధిని అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లోనే ఎక్కువగా
గుర్తిస్తున్నారని, బహుశా సమాజంలోని లింగవివక్షే ఇందుకు కారణం కావొచ్చని ‘ద
లాన్సెట్ ఆంకాలజీ’ పత్రికలో ప్రచురితమైన పరిశోధన కథనం తెలిపింది. 0 నుంచి 19
సంవత్సరాల మధ్య వయసుండి, క్యాన్సర్ బారిన పడినవారి సమాచారాన్ని పరిశోధకులు
సేకరించారు. భారతదేశంలోని మూడు ప్రధాన క్యాన్సర్ ఆసుపత్రుల నుంచి 2005 జనవరి
1 – 2019 డిసెంబరు 31 మధ్య రికార్డులను వారు పరిశీలించారు. దాంతో క్యాన్సర్‌కు
చికిత్స పొందుతున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఎంతమందనే విషయం తెలిసింది.
పీబీసీఆర్లలో నమోదైన సుమారు 11వేల మంది రోగుల్లో అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా
ఉందని, మూడు ఆసుపత్రుల్లోని 22వేల మంది పిల్లల్లోనూ ఎక్కువమంది బాలురేనని
దిల్లీ ఎయిమ్స్‌లోని మెడికల్ ఆంకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సమీర్
బక్షి తెలిపారు. పిల్లలను వ్యాధి నిర్ధారణకు తీసుకురావడంలో కొంత లింగవివక్ష
ఉండొచ్చని, కానీ ఒకసారి తీసుకొచ్చి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఈ వివక్ష
ఉండట్లేదని ఆయన వివరించారు. దక్షిణ భారతంతో పోలిస్తే ఉత్తర భారతంలో అమ్మాయిలు
ఆసుపత్రుల్లో చికిత్సకు తక్కువగా వస్తున్నట్లు పరిశోధకులు గమనించారు.