ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్ లకు మధ్య ఉన్న సంబంధాలను గుర్తించడం కోసం
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. దేశ రాజధాని
ఢిల్లీతో పాటు ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, చండీగడ్, హర్యానా
రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గ్యాంగ్స్టర్ ల ఇళ్లలో నేషనల్ ఇన్వెస్టిగేషన్
ఏజెన్సీ సోదాలు కొనసాగుతున్నాయి. కొంత కాలంగా గ్యాంగ్స్టర్ లకు ఉగ్రవాదులతో
సంబంధాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే రెండుసార్లు
తనిఖీలు చేసినట్లుగా తెలుస్తోంది. గ్యాంగ్స్టర్లు, టెర్రరిస్ట్ గ్రూపుల మధ్య
సంబంధాలపై ఎన్ఐఏ వరుస దాడులు కొనసాగిస్తోంది.