శత్రు దేశాల డ్రోన్ల పనిపట్టేందుకు భారత సైన్యం సరికొత్త ఆయుధాన్ని సిద్ధం
చేసింది. డ్రోన్లను గాల్లోనే వేటాడేలా గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఈ
విధమైన కార్యక్రమం ఆర్మీలో ఇదే మొదటిసారి. శత్రు దేశాల డ్రోన్ల పనిపట్టేందుకు
భారత సైన్యం సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది. డ్రోన్లను గాల్లోనే వేటాడేలా
గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఈ విధమైన కార్యక్రమం ఆర్మీలో ఇదే తొలిసారి.
ఉత్తరాఖండ్‌లోని ఔలీలో సాగుతోన్న భారత్, అమెరికాల ఉమ్మడి సైనిక శిక్షణ
కసరత్తులు ‘యుద్ధ్ అభ్యాస్’లో భాగంగా ఈ ట్రైనింగ్ ఫలితాలను ప్రదర్శించారు.
ఇందులో భాగంగా.. తొలుత ఓ డ్రోన్‌ను గాల్లో ఎగురవేశారు. దాని శబ్దాన్ని
గ్రహించిన ఓ ఆర్మీ శునకం.. సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే
డ్రోన్లను వేటాడే శిక్షణ పొందిన ‘అర్జున్’ అనే గద్ద.. గాల్లోని ఆ డ్రోన్
ఆచూకీని పట్టేసి, దాన్ని కూల్చేసింది. ఆర్మీ ఇప్పటికే శునకాలతోపాటు గద్దలకు
శిక్షణ ఇచ్చి.. ఆయా సైనిక కార్యకలాపాలకు వినియోగిస్తోంది. అయితే, శత్రు
డ్రోన్లను వేటాడేందుకు గద్దలను ఉపయోగించడం ఇదే తొలిసారని సైనిక అధికారులు
వెల్లడించారు. ఇదిలా ఉండగా.. పంజాబ్, జమ్మూ-కశ్మీర్ తదితర సరిహద్దు
రాష్ట్రాల్లో కొంతకాలంగా తరచూ డ్రోన్ల చొరబాటు ఘటనలు నమోదవుతోన్న విషయం
తెలిసిందే. డ్రోన్లతో గూఢచర్యం, స్మగ్లింగ్ కోసం చేస్తున్న ప్రయత్నాలను
సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. ఈ క్రమంలో శిక్షణ పొందిన గద్దలు
ఆర్మీకి మరింత చేదోడుగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.