రాజస్థాన్లోని కాంగ్రెస్ పార్టీలో సీఎం అశోక్ గహ్లోత్, మంత్రి సచిన్ పైలట్
మధ్య మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం సచిన్
పైలట్ పై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
సచిన్ పైలట్ ను విశ్వాస ఘాతకుడిగా అభివర్ణించిన గహ్లోత్.. అలాంటి వ్యక్తితో
సీఎం స్థానాన్ని భర్తీ చేయలేరని వ్యాఖ్యానించారు. 2020లో కాంగ్రెస్కు
వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సొంత ప్రభుత్వాన్నే పడగొట్టేందుకు
ప్రయత్నించారంటూ ఆరోపించారు. పైలట్ తిరుగుబాటుబావుటా ఎగురవేయడంలో కేంద్ర
హోంమంత్రి, భాజపా సీనియర్ నేత అమిత్ షా ప్రమేయం కూడా ఉందని గహ్లోత్
ఆరోపించారు. పైలట్ కు విధేయులైన కొందరు ఎమ్మెల్యేలు నెలరోజులకు పైగా
గురుగ్రామ్ లోని రిసార్ట్ లలో ఉన్నారన్నారు.