బీజేపీ నేత సువేందు అధికారి తొలిసారిగా శుక్రవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
మమతా బెనర్జీని కలిశారు. వీరిద్దరి సమావేశం అందరినీ ఆశ్చర్య పరిచింది.
బెంగాల్ అసెంబ్లీ క్యాంపస్‌లో ప్లాటినం జూబ్లీ స్మారక భవనాన్ని శుక్రవారం
ప్రారంభించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారిని
తన చాంబర్‌కు సీఎం మమత ఆహ్వానించారు. దీంతో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు
అగ్నిమిత్ర పాల్, మనోజ్ తిగ్గాతో కలిసి అసెంబ్లీలోని మమత చాంబర్‌కు సువేందు
అధికారి తొలిసారి వెళ్లారు. ఇదిలా ఉండగా, శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల
సమయంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
సమాధానమిచ్చారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి పంపిన ఆహ్వానాలపై ఆమె మౌనం
వీడారు. “ఈ సమావేశానికి చాలా మందిని ఆహ్వానించాం’’ అని మమత వ్యాఖ్యానించారు.
అధికారిక హోదాలో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణిని కూడా ఆహ్వానించామన్నారు.
తాము ఎక్కడా వివక్ష చూపలేదన్నారు.