పాత ఢిల్లీలోని చాందిని చౌక్‌లో గల భగీరథ్ ప్యాలెస్ బజార్(మార్కెట్)లో
గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోల్‌సేల్ ఎలక్ట్రికల్ వస్తువుల
హబ్‌గా పిలువబడే ఈ మార్కెట్ లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
క్రమంగా అవి పక్కనున్న దుకాణాలకు వ్యాపించడంతో పరిస్థితిని అదుపులోకి
తీసుకురావడానికి సుమారు 40 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. రాత్రి 9.20 గంటలకు
అగ్నిమాపక శాఖకు ఈ ఘటనపై ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని
40 ఫైరింజన్లతో రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో
ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని జరుగలేదని అధికారులు వెల్లడించారు. భవనంలోని చాలా
షాపులు దెబ్బతిన్నాయని, భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఢిల్లీ ఫైర్
సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ వెల్లడించారు. ఇరుకైన, మలుపులు తిరిగే
వీధుల కారణంగా, అగ్నిమాపక వాహనాలు చాందినీ చౌక్‌కు సమీపంలో ఉన్న ప్రమాద
స్థలానికి చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది.