అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారా? అయితే అటువంటి వారు మరో 3
సంవత్సరాలు ఆగక తప్పదు. ఎందుకంటే అమెరికా పర్యాటక వీసా అపాయింట్మెంట్ కోసం
దాదాపు 1000 రోజుల వెయిటింగ్ లిస్ట్ ఉంది. అమెరికాకు వ్యాపారం నిమిత్తం
బీ-1, టూరిస్ట్ వీసాల కోసం బీ-2 దరఖాస్తులను మొదటిసారి చేసుకున్నవారికి
ఇప్పుడు వేచి ఉండే సమయం దాదాపు మూడు సంవత్సరాల వరకు చేరింది. అమెరికా విదేశీ
వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. మొదటి
సారి ఇంటర్వ్యూ అవసరమయ్యే బీ1(వ్యాపారం), బీ2(పర్యాటక) దరఖాస్తుదారులు దాదాపు
మూడేళ్లపాటు వీసా అప్పాయింట్ మెంట్ కోసం వేచి చూడక తప్పదు. ‘కేవలం కొత్తగా
వీసా పొందేవారికే నిరీక్షణ సమయం ఎక్కువగా ఉంటోంది. ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న
దరఖాస్తుదారులకు అత్యవసర అపాయింట్మెంట్లు రోజుల్లో అందుబాటులో ఉంటాయి.
వీలైనంత త్వరగా వెయిటింగ్ పీరియడ్‌ని తగ్గించడంతో పాటు వీసా జారీ ప్రక్రియను
వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము, ”అని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్
ఒక ట్వీట్లో తెలిపింది.