సమాజంలో హింస, ద్వేషం, భయాన్నితొలగించేందుకే తాను భారత్ జోడో యాత్ర చేపట్టానని
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న జోడో
యాత్ర బుధవారం ఉదయం మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించింది. బుర్హానపూర్ జిల్లా
బోదర్లి గ్రామంలో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే జాతీయ జెండాను
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్‌కు అందజేశారు. అరటిపండ్లను
ఎక్కువగా పండించే బోదర్లి గ్రామస్తులు అరటి ఆకులతో ఆ ప్రాంతాన్ని అలంకరించగా..
జానపద కళాకారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ
శ్రీనగర్ చేరేంతవరకు తమను ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలోని
బీజేపీ విద్యను ప్రైవేటుపరం చేసి, పేదలను చదువుకు దూరం చేస్తోందన్నారు.
పరిశ్రమలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలన్నీ కొందరు పారిశ్రామికవేత్తల
చేతుల్లోనే ఉన్నాయని, రైల్వేను కూడా వారికే కట్టబెట్టేందుకు కుట్రలు
జరుగుతున్నాయని ఆరోపించారు.