శ్రద్ధావాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసుల విచారణ వేగంగా కొనసాగుతోంది.
నిందితుడు ఆఫ్తాబ్కు మరో నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీని కోర్టు
పొడిగించింది. మరోవైపు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్నపిటిషన్ను ఢిల్లీ
హైకోర్టు కొట్టేసింది. ఢిల్లీ పోలీసుల విచారణను అనుమానించాల్సిన అవసరం లేదని
కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, అకస్మాత్తుగా కోపం రావడంతో క్షణికావేశంలో
శ్రద్దాను హత్య చేసినట్టు కోర్టులో జడ్జి ఎదుట నిందితుడు ఆఫ్తాబ్
వెల్లడించినట్లు సమాచారం. మొహ్రాలి అడవుల్లో శ్రద్దా హత్యకు ఉపయోగించిన
బ్లేడును, రంపాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులు
ఆఫ్తాబ్కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు
ఆఫ్తాబ్ ఫ్లాట్లో ఢిల్లీ పోలీసులకు మరిన్ని ఆధారాలు లభించాయి. కాగా,
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తన
ప్రియురాలిని మే 18న హత్య చేశాడు. సుమారు ఆరునెలల తర్వాత కానీ ఇది వెలుగులోకి
రాలేదు. నవంబరు 14న ఢిల్లీ పోలీసులు పూనావాలాను అదుపులోకి తీసుకుని
విచారించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మరోవైపు శ్రద్ధా వాకర్ తండ్రి
నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.