జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్ర కుట్రను భారత భద్రతాబలగాలు భగ్నం చేశాయి.
ఉగ్రవాదుల నుంచి భారీగా పేలుడు పదార్ధాలను, ఆయుధాలను స్వాధీనం
చేసుకున్నాయి. బందిపొరా జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను,
వారికి సహాయకులుగా ఉన్న మహిళ సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ,
జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేసిన ఈ ఆపరేషన్ తో భారీ ఉగ్రదాడి ప్రణాళిక
భగ్నమైంది. లష్కరే ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు
సామగ్రిని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అలాగే, అదుపులోకి తీసుకున్న
ఉగ్రవాదులను ఇమ్రాన్ మాజిద్ మీర్ జాఫర్, సురయ రషీద్ వనీ అలియాస్ సెంటీ అలియాస్
తబిష్ గా గుర్తించారు. ఈ ఇద్దరు కూడా స్థానికులే. కాగా, ఈ ఉగ్ర కుట్రను పాక్
ఆక్రమిత కశ్మీర్లో ఉన్న లష్కరే కమాండర్ బాబర్ అలియాస్ సామమ హ్యాండిల్
చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. బాగా రద్దీ ఉన్న ప్రాంతంలో బాంబు
దాడులకు పాల్పడాలన్న ప్రణాళికలో వారు ఉన్నట్లు తేలిందన్నారు.