దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన
నలుగురు హత్యకు గురయ్యారు. మృతుల్లో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. మరో
ఇద్దరిలో ఒకరు మృతుల తండ్రి కాగా.. మరొకరు అమ్మమ్మ. ఈ ఘటన దేశ రాజధాని
ఢిల్లీలో కలకరం రేపింది. ఢిల్లీ హర్ష్ విహార్ సమీపంలోని పాలెం ప్రాంతంలో ఓ
ఇంట్లో వారంతా కలిసి నివాసముంటున్నారు. అయితే, మంగళవారం వారంతా హత్యకు
గురయ్యారు. పాలెం పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మహిళల్లో ఒకరు నేలపై పడి ఉండగా, మరో ఇద్దరు బాత్రూమ్లో హత్యకు గురయ్యారు. ఈ
హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మృతుల బంధువు పారిపోవడానికి
ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. అతడిని పోలీసులకు అప్పగించారు.
నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడికి స్థిరమైన ఉద్యోగం లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య గొడవలే నేరానికి
కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.