గుజరాత్ లో డిసెంబరు 1న జరగనున్నమొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 రోజుల
కంటే తక్కువ సమయం ఉంది. ఈ తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ
ప్రచారాన్నివేగవంతం చేశాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, కొత్తగా
ప్రవేశించిన అప్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలో సోమవారం
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. ప్రధాని
నరేంద్ర మోదీ రెండు భారతదేశాలను సృష్టించారన్నారు. ఒకటి ధనవంతుల కోసం, మరొకటి
పేదల కోసం అని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని వనరులను కొంతమంది సంపన్నులకు
దోచి పెడుతున్నారని ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో రైతులు, యువకులు,
గిరిజనులను కలుసుకుని వారి కష్టాలను తాను అర్థం చేసుకున్నా నని పేర్కొన్నారు.