ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రధానంగా
అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్యే పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది.
మొత్తం 250 స్థానాలకు గాను 232 మంది అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో 126
మంది మహిళలు ఉన్నారు. 9 మంది మాజీ మేయర్లు, 52 మంది మాజీ కౌన్సిలర్లు,
ముగ్గురు డాక్టర్లు, నలుగురు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. గత అసెంబ్లీ
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఇద్దరు రాష్ట్ర పదాధికారులకు కూడా
ఈసారి పోటీ చేసే అవకాశం కల్పించారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే
250 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఎంసీడీకి డిసెంబర్ 4 న ఎన్నికలు
జరుగనున్నాయి. 7 న ఫలితాలు ప్రకటిస్తారు. 2017 ఎన్నికల్లో బీజేపీ 181
స్థానాల్లో విజయం సాధించగా.. ఆప్ 49, కాంగ్రెస్ 31 వార్డులను గెలుచుకున్నది.
ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన నాయకులతో సహా దాదాపు 4,000 మంది
పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారని పార్టీ నాయకులు శుక్రవారం
తెలిపారు. వచ్చే నెలలో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికలు జరగనున్న
తరుణంలో తమ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు బీజేపీ అన్ని రకాల
ప్రయత్నాలూ చేస్తోంది.