గుజరాత్లో గత రెండున్నర దశాబ్దాలకుపైగా అధికారంలో ఉన్న బీజేపీ ఆదివాసీల ఓట్లను
సంపాదించడంలో వెనకబడే ఉంది. అయితే ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత
కీలకమైన ఆదివాసీల ఓట్లు సంపాదించటానికి కాంగ్రెస్, భాజపా, ఆమ్ ఆద్మీలు
చెమటోడుస్తున్నాయి. రెండున్నర దశాబ్దాలకుపైగా గుజరాత్లో అధికారం
చలాయిస్తున్నా భారతీయ జనతాపార్టీ ఒక విషయంలో మాత్రం ఇంకా వెనకబడే ఉంది. అది
అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీ ఓట్లు, సీట్లు గెల్చుకోవటంలో గుజరాత్లో అన్ని
పార్టీలనూ ఆకర్షిస్తున్న వర్గం ఆదివాసీలు! రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత
కీలకమైన ఆదివాసీల ఓట్లు సంపాదించటానికి కాంగ్రెస్, బీజేపీ ఆమ్ ఆద్మీలు
చెమటోడుస్తున్నాయి. కారణం గ్రామీణ ప్రాంతాల్లోని అనేక నియోజకవర్గాల్లో రాష్ట్ర
జనాభాలో 15 శాతం ఉన్న ఆదివాసీల ఓట్లే కీలకం.
గుజరాత్లో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్ పార్టీ వైపే
ఇప్పటిదాకా మొగ్గు చూపుతూ వస్తున్నారు. అధికారాన్ని అందుకోలేకపోతున్నా
ఆదివాసీల ఓట్లు, సీట్లను మాత్రం కాంగ్రెసే ఎక్కువగా సాధిస్తోంది. 2017
ఎన్నికల్లో 27 రిజర్వ్డ్ సీట్లకుగాను కాంగ్రెస్ 15 గెల్చుకోగా.. భాజపా
ఎనిమిదింటిలో మాత్రమే నెగ్గింది. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచీ ఆదివాసీ
ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతూనే ఉంది. ‘గతంలో మా ప్రభుత్వాలు ఇచ్చిన
అటవీ ఉత్పత్తులపై హక్కు, ఇతర అభివృద్ధి పనులకు విశ్వాసంతో ఆదివాసీలు మాతోనే
ఉంటున్నారు. ఇక ముందు కూడా ఉంటారు’ అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం
జేస్తున్నారు. అసెంబ్లీలో విపక్ష నేత పదవిని కూడా.. జేత్పుర్ ఎమ్మెల్యే
ఆదివాసీ నేత సుఖ్రామ్ రాత్వాకు కాంగ్రెస్ అప్పగించింది.ఈసారి ఎలాగైనా
ఆదివాసీలపై కాంగ్రెస్ పట్టును దెబ్బతీయాలని భాజపాతో పాటు కొత్తగా బరిలోకి
దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలంగా ప్రయత్నిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర
మోడీ పదేపదే ఈ ప్రాంతాల్లో పర్యటించారు. బీజేపీ ఇటీవలే ఈ ప్రాంతాల్లో గుజరాత్
గౌరవ్ యాత్ర చేపట్టింది. “ఈసారి మేం 27 సీట్లకుగాను 20 గెల్చుకోబోతున్నాం.
ఆదివాసీల్లో కూడా మోదీపట్ల ఆదరణ పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో
కాంగ్రెస్ ఓట్లు చీలిపోబోతున్నాయి” అని గుజరాత్ ఆదివాసీ అభివృద్ధి శాఖ
మంత్రి నరేశ్ పటేల్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కంటే
కాంగ్రెస్ను ఆదరిస్తున్న ఆదివాసీలు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకే
మద్దతిస్తుండటం విశేషం.