పశ్చిమ ఇండోనేషియా తీరంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఎటువంటి
నష్టం జరగలేదని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే శుక్రవారం
వెల్లడించింది. సుమత్రా బెంగ్కులుకు నైరుతి దిశలో దాదాపు 155 కిలోమీటర్ల (95
మైళ్లు) దూరంలో ఉన్న చిన్న ద్వీపమైన ఎంగానోలో నిస్సార లోతులో 6.0 తీవ్రతతో
భూకంపం సంభవించిందని నివేదించింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో
అదేప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో
నమోదైందని తెలిపింది. జాతీయ విపత్తు ఉపశమన సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి
“మేము భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న ఎంగానో ద్వీపంలో అధికారులతో తనిఖీ
చేశాం. భూకంపం అక్కడ బలహీనంగా ఉందని వారు నివేదించారు. ఇప్పటివరకు నష్టం లేదా
ప్రాణనష్టంపై ఎటువంటి నివేదికలు లేవు, కానీ మేము ఇంకా మరింత అంచనా
వేస్తున్నాము.” అని అన్నారు.