పశ్చిమ బెంగాల్ కు కొత్త గవర్నర్ నియమితులయ్యారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆనంద
బోస్ ను పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమించారు. ఉప రాష్ట్రపతి గా పోటీ చేయడం
కోసం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీశ్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఆ పదవికి
ఖాళీ ఏర్పడింది. ఇప్పటివరకు మణిపూర్ గవర్నర్ గణేశన్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా
అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా మాజీ
సివిల్ సర్వెంట్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ ను కేంద్రం నియమించింది. ఈ మేరకు
గురువారం రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో ఐఏఎస్
అధికారిగా పలు జిల్లాల్లో కలెక్టర్ గా, కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖల్లో
సెక్రటరీ, ప్రిన్స్ పల్ సెక్రటరీ, యూనివర్సిటీ వైస్ చాన్సెలర్, చీఫ్ సెక్రటరీ
తదితర కీలక బాధ్యతలను డాక్టర్ సీవీ ఆనంద బోస్ నిర్వర్తించారు. విద్య, అటవీ,
జనరల్ అడ్మినిస్ట్రేషన్ తదితర శాఖల్లో సేవలందించారు. ఐరాస ‘హ్యాబిటాట్
అలయన్స్’ కు చైర్మన్ గా కూడా వ్యవహరించారు.