మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు నిందితులను విడుదల చేస్తూ
నవంబర్ 11న వెలువరించిన తీర్పు ప్రస్తుతం ప్రకంపనలు రేకెత్తిస్తోంది. రాజీవ్
హత్య కేసు దోషులను విడుదల చేయడంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును
ఆశ్రయించింది . దోషుల విడుదల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీం
కోర్టులో గురువారం ఓ పిటిషన్ దాఖలు చేసింది. తగిన విచారణ లేకుండా దోషుల
విడుదల జరిగిందని, ఇలా చేయడం ద్వారా న్యాయసూత్రాలను ఉల్లంఘించినట్లవుతుందని
పిటిషన్లో కేంద్రం పేర్కొంది . మూడు దశాబ్దాలుగా వారి జైలు జీవితం తమిళనాడులో
రాజకీయ సమస్యగా మారిందని, ఇలాంటి సున్నితమైన అంశంలో కేంద్రం సలహా అవసరమని
అభిప్రాయపడింది. ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చేందిన వారు కాగా..
ఉగ్రవాదులుగా ముద్ర పడినవారికి క్షమాభిక్ష పెట్టడం అంతర్జాతీయంగా ప్రభావం
చూపిస్తుందని తెలిపింది. తాము హాజరుకాకుండా ఉత్తర్వులు జారీ చేయడంతో కేంద్రం
అత్యున్నత న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. గత శనివారం మాజీ ప్రధాని రాజీవ్
గాంధీ హంతకులు మొత్తం ఆరుగురు తమిళనాడు రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి
విడుదలయ్యారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని “పూర్తిగా అనుచితమైనది, తప్పుడుది ”
అని కాంగ్రెస్ పార్టీ గతంలో విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత జైరాం
రమేష్ ఈ నిర్ణయం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని బహిరంగ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం
చేసిన విషయం తెలిసిందే.