దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన పాశవిక ‘శ్రద్ధా హత్య కేసు’లో మరిన్ని
షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. శ్రద్ధా మృతదేహాన్ని 35 ముక్కలుగా ఖండించిన
అఫ్తాబ్ అమీన్ పూవానాలా శరీర భాగాలు ఫ్రిడ్జ్‌లో ఉండగానే నమ్మశక్యంకాని చర్యకు
పాల్పడ్డాడు. మరో యువతితో డేటింగ్ మొదలుపెట్టి.. ఆమెను తన అపార్ట్‌మెంట్‌కు
తీసుకొచ్చుకునేవాడని పోలీసులు వెల్లడించారు. శ్రద్ధా వాల్కర్(26)ను కలిసిన
డేటింగ్ యాప్ ‘బంబుల్’ పైనే కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ని కలిశాడని, శ్రద్ధాను చంపిన
15-20 రోజుల్లోనే ఆమెతో డేటింగ్ మొదలుపెట్టాడని అధికారులు వివరించారు.
కొత్త ప్రేయసిని రెగ్యులర్‌గా అపార్ట్‌మెంట్‌కు తీసుకొస్తుండేవాడని, ఆ సమయంలో
ఫ్రిడ్జ్‌లోని శరీర భాగాలను కప్‌బోర్డ్‌లోకి మార్చేవాడని పోలీసులు తెలిపారు.
శ్రద్ధా శరీర భాగాలను ముక్కలుగా నరికిన గదిలోనే నిద్రించేవాడని, శ్రద్ధా తలను
ఫ్రిడ్జ్‌లో పెట్టి చూస్తుండేవాడని దర్యాప్తులో తేలిందన్నారు. రాత్రి 2 గంటల
సమయంలో శరీర భాగాలనే పడేసేవాడని చెప్పారు. నల్లటి కవర్లో శరీర భాగాలను
తీసుకెళ్లేవాడు కానీ ఆ కవర్‌ను మాత్రం అక్కడ వదిలేసేవాడు కాదు. ఎవరికీ అనుమానం
కలగకుండా ఈ విధంగా వ్యవహరించాడని పోలీసులు వివరించారు. చెఫ్‌గా శిక్షణ పొందిన
అఫ్తాబ్.. రక్తపు మరకలను ఎలా క్లీన్ చెయ్యాల్లో గూగుల్‌లో తెలుసుకున్నాడు.
శరీరాన్ని ముక్కలుగా కట్ చేయడానికి ముందు శరీర నిర్మాణం ఏవిధంగా ఉంటుందో కూడా
తెలుసుకున్నాడు. కాగా శరీర భాగాలు ఖండించడానికి ఏ కత్తిని ఉపయోగించాడనేదానిపై
పోలీసులు అన్వేషిస్తున్నారు. మరోవైపు శ్రద్ధా హత్యపై ఎవరికీ అనుమానం రాకుండా..
ఆమె ఇన్స్టాగ్రామ్ యాక్టివ్‌గా ఉండేలా అఫ్తాబ్ వ్యవహరించాడని, శ్రద్ధా
ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉండేవాడని పోలీసులు గుర్తించారు. అయితే రెండు నెలలుగా ఆమె
ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండడంతో ఆమె స్నేహితురాళ్లకు అనుమానం వచ్చిందని
వివరించారు. హత్య చేయాలనే ప్రణాళికలో భాగంగానే అపార్ట్మెంట్ అద్దెకు
తీసుకున్నాడని అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు. నిందితుడిని ఐదు రోజుల
కస్టడీకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు
సోమవారం తెలిపారు.