ఉపయోగించుకుని గుజరాత్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయకేతనం ఎగురవేయాలని
భావిస్తోంది. అయితే అధికారంలో ఉండే పార్టీపై వ్యక్తమయ్యే ప్రజా వ్యతిరేకతను ఆ
రెండింటి ద్వారా అధిగమించాలని ఆ పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు. ప్రధాని
నరేంద్ర మోడీకి ఉన్న ప్రజాదరణ, హిందుత్వ నినాదం.
ఈ రెండింటి ఆధారంగా ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించాలని గుజరాత్లో బీజేపీ
భావిస్తోంది. అధికారంలో ఉండే పార్టీపై వ్యక్తమయ్యే ప్రజా వ్యతిరేకతను
వీటిద్వారా అధిగమించాలని కమలనాథులు సమాయత్తమవుతున్నారు. తొలి జాబితాలో 160
మంది పేర్లను భాజపా ప్రకటించింది. 111 మంది సిట్టింగు ఎమ్మెల్యేల్లో 69 మందికే
మరోసారి అవకాశం కల్పించింది. అహ్మదాబాద్‌లోనైతే 12 మందిలో 10 మందిని
మార్చేసింది. బయటకు కనపడని రీతిలో ప్రభుత్వ వ్యతిరేకత కొన్ని ప్రాంతాల్లో
బలంగా ఉంది. హిందుత్వ, రామ మందిరం వంటి అంశాలవైపు మొగ్గాలా, నిరుద్యోగం వంటి
వాస్తవ సమస్యల ఆధారంగా ఎన్నికల్లో స్పందించాలా అనే మీమాంస సగటు ఓటర్లలో ఉంది.
దీంతో అలాంటివారి మనసును మార్చడంలో ఏ ఒక్క ప్రయత్నాన్ని వదులుకోరాదని
కమలనాథులు తపన పడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడం, సామాజిక సమీకరణాల
సంతులనంలో భాగంగానే 2021 సెప్టెంబరులో విజయ్ రూపాణీ స్థానంలో భూపేంద్ర
పటేల్‌ను తీసుకువచ్చారు. స్వయానా మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కలిసి
తీసుకున్న నిర్ణయమది.
1995 నుంచి కమలం కంచుకోట
గుజరాత్ 1995 నుంచి ఇంతవరకు కమలానికి కంచుకోటగానే ఉంది. మధ్యలో కొన్నాళ్లు
రాష్ట్రపతి పాలన విధించినా మిగిలిన కాలమంతా బీజేపీ సీఎంలే రాష్ట్రాన్ని
పాలించారు. అందువల్ల ప్రజలకు మొహం మొత్తేసిందా అనే అనుమానాలైతే లేకపోలేదు.
అయితే ‘మోదిత్వ’ అంశం కారణంగా బీజేపీ పరిస్థితి సురక్షితంగానే ఉందనే భావన
పలువురిలో వ్యక్తమవుతోంది.
సీఎం అంటే కామన్ మ్యాన్ (సాధారణ వ్యక్తి) అని తాను భావిస్తానని చెప్పే
పటేల్.. ఎలాంటి డాంబికాలకు పోకుండా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారని,
తద్వారా అన్నివర్గాల ఓటర్లకు చేరువ అవుతున్నారని అహ్మదాబాద్‌కు చెందిన రాంజీ
పటేల్ చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చాలావరకు తగ్గిపోతాయనేది ఆయన
అంచనా. కాంగ్రెస్ బలంగా బరిలో లేకపోవడం, ఆప్ ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ
కావడం ఈ అంచనాను బలపరుస్తోంది.