నాలుగు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని హత్య చేసి కొంతమంది వ్యక్తులు శవాన్ని ఓ
ఇంటిలో పాతిపెట్టారు. నాలుగేళ్ల తర్వాత పోలీసులు ఆ ఇంటిలో కొంత భాగాన్ని
తవ్వగా అస్తిపంజరం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్
మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ అస్థిపంజరం నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన
మహ్మద్ హసన్దేనని భావిస్తున్నారు. పోలీసులు అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్
పరీక్షకు పంపారు. మన్సూర్పూర్ పోలీస్ స్టేషన్ అధికారి బ్రిజేందర్ సింగ్ రావత్
పలు విషయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. “మేము సల్మాన్ ఇంటిలో
పాతిపెట్టిన అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నాము. మహ్మద్ హసన్ మిస్సింగ్
కేసుకు సంబంధించి ఇంటి తవ్వకం జరిగింది. అయితే, ఈ అస్థిపంజరం నవంబర్ 12, 2018
నుంచి తప్పిపోయిన అదే గ్రామానికి చెందిన వ్యక్తిద”ని తెలిపారు.
కొద్దిరోజుల క్రితం హంతకుడు శవాన్ని తన ఇంట్లో పాతిపెట్టినట్లు కొందరి ముందు
ఒప్పుకున్నాడని తెలిసింది. ఆ సమాచారం మేరకే పోలీసులు అస్తిపంజరాన్ని
గుర్తించారు.