కొన్ని పరస్పర ఉపసంహరణల తర్వాత, వాస్తవ నియంత్రణ రేఖ (LAC)లో భారతదేశం, చైనా
మధ్య వాతావరణం ప్రస్తుతానికి నిశ్శబ్దంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇరు
దేశాల సైనిక నాయకత్వం ఇంకా సంప్రదింపులలో నిమగ్నమై ఉంది. ఈ తరుణంలో లడఖ్‌లో
పరిస్థితి స్థిరంగా ఉందని భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పష్టం
చేశారు. శనివారం ఆర్మీ చీఫ్ ‘చాణక్య డైలాగ్స్’ అనే థింక్-ట్యాంక్‌ను
ఉద్దేశించి ప్రసంగించారు. మిగిలిన సమస్యలను పరిష్కరించడానికి చైనాతో తదుపరి
రౌండ్ కార్ప్స్ కమాండర్-స్థాయి చర్చల వైపు భారతదేశం చూస్తోందన్నారు.
భారతదేశం, చైనా 16 రౌండ్ల సంప్రదింపులను నిర్వహించాయని వెల్లడించారు. దాని
ఫలితంగా గణనీయమైన పురోగతి సాధించినట్లు మనోజ్ పాండే తెలిపారు. అయితే
ఇప్పటికీ అనేక సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. 17వ విడత చర్చల తేదీని
పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి
ప్రస్తుత పరిస్థితి గురించి విలేకరులు అడగ్గా పీఎల్ఏ తన బలగాన్ని గణనీయంగా
తగ్గించలేదని చెప్పారు.