జార్ఖండ్ రాష్ట్రం చక్రధర్‌పూర్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో శనివారం
సాయంత్రం క్రూడ్ బాంబులు విసిరిన ఘటనలో బజరంగ్ దళ్‌కు చెందిన ఒక కార్యకర్త
హతమయ్యాడు. చక్రధర్‌పూర్‌లోని భారత్ భవన్ చౌక్‌లో ఈ ఘటన జరిగింది.
ద్విచక్ర వాహనంపై వచ్చిన కొందరు కమల్ దేవగిరిపై బాంబులు విసిరారని
స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనలో కమల్ దేవగిరి అక్కడికక్కడే మృతి
చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు పోలీసు
సూపరింటెండెంట్ అశుతోష్ శేఖర్ తెలిపారు. అయితే ఇద్దరు నిందితులను పోలీసులు
అదుపులోకి తీసుకున్నప్పటికీ వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు. వందలాది
మంది దేవగిరి అనుచరులు సంఘటన స్థలం వద్ద గుమిగూడారు. నిత్యం సందడిగా ఉండే
భారత్ భవన్ చౌక్‌లో బాంబుదాడితో కలకలం చెలరేగింది. దీంతో స్థానికులు తమ
వ్యాపారాలను తాత్కాలికంగా మూసివేశారు.