సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ తరపున ఎన్నికల
ప్రచారంలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కాంగ్రెస్ పార్టీపై
విరుచుకుపడ్డారు. ఆ పార్టీ కేవలం దేశ భద్రతకు విరుద్ధమే కాదు.. దేశాభివృద్ధికి
కూడా వ్యతిరేకమని విమర్శలు గుప్పించారు. హిమాచల్‌లోని మండి, సోలన్ లో జరిగిన
మొదటి ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ.. కేంద్రంలో కాంగ్రెస్ హయాంలో
జరిగిన రక్షణ ఒప్పందాల అంశాన్ని లేవనెత్తారు. ఆయుధాల సేకరణలో జాప్యానికి
దారితీసిన ప్రతి డీల్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ “కమీషన్ కావాలి” అంటూ
ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం రక్షణ రంగంలో దేశంలోనే తొలి స్కామ్ చేసింది
కాంగ్రెస్.. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు రక్షణ
ఒప్పందాల విషయంలో చాలా కుంభకోణాలకు పాల్పడిందని ప్రధాని మోడీ ఆరోపించారు. దేశం
అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ ఎన్నడూ కోరుకోలేదని ఆయన అన్నారు. ప్రతి రక్షణ
ఒప్పందంలో కమీషన్ కావాలని, పార్టీ సొంత నాయకుల నిధిని నింపాలని ఆ పార్టీ
కోరుకుందని.. అందుకే ఆయుధాల సేకరణ ఆలస్యమైందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.