దేవ్ ప్రకాష్ సొల్యూషన్స్ కార్యాలయాల్లో గుజరాత్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం సోదాలు చేస్తోంది. 2007 భూకంపం తర్వాత మోర్బి బ్రిడ్జిని ఒరెవా పునరుద్ధరించారు. అధికారులు ఒక ప్రకాష్ భాయ్- దేవ్ ప్రకాష్ సొల్యూషన్స్ మధ్య సంబంధాన్ని పరిశీలిస్తున్నారు. మోర్బి మున్సిపాలిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ సింగ్ ఝాలాను కూడా బుధవారం ప్రశ్నించారు. అక్టోబరు 30న మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో అనేక మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వంతెన పునర్నిర్మాణం కాంట్రాక్ట్ తీసుకున్న ఒరేవా గ్రూప్ కార్యాలయంలో కూడా పోలీసులు సోదాలు చేశారు.