ఆసియా, అమెరికా అంతటా తుఫానులు.. పాకిస్తాన్లో విధ్వంసకర వరదలు… హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఆకలి, కరువు.. ఐరోపా అంతటా ఇవే సమస్యలు ఎదురవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవడానికి గల మార్గాలపై చర్చించడానికి నవంబర్‌లో దాదాపు 200 దేశాలు ఈజిప్టులో సమావేశం కానున్నాయి. పై విపత్తులకు వ్యతిరేకంగా ఈ COP-27 వాతావరణ సమావేశం జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్‌ను పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే.. రెండు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంచడంలో పురోగతి సాధించాలని నిర్ణయించారు. 1.5 డిగ్రీలు అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యాలు 2015 పారిస్ ఒప్పందంలోనే తీసుకున్నా ప్రస్తుతం అవి మళ్లీ వార్తల్లోకి ఎక్కాయి. అయితే, అంచనాల ప్రకారం, శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతలు దాదాపు 2.7 సెల్సియస్ పెరిగే అవకాశంఉంది. ప్రస్తుతం అవి ఉన్న ప్రదేశం నుంచి 1.2 సెల్సియస్ వరకు పెరుగే అవకాశం ఉంది.