టీ బ్యాగ్‌లు, లోదుస్తులను పాతిపెట్టి భూమి సామర్థ్యాన్ని పరీక్ష చేయవచ్చా?.. యూనివర్శిటీ ఆఫ్ జూరిచ్ కాగ్నిటివ్ సైంటిస్ట్ మార్సెల్ వాన్ డెర్ హీజ్డెన్ ఈ నూతన భూసార పరీక్షను కనుగొన్నాడు. ఇది వింతగా అనిపించినప్పటికీ, ఆల్పైన్ దేశపు నేల పరిస్థితిని అంచనా వేయడంలో పరిశోధకులు వింత ప్రయోగాలు చేస్తున్నారు. స్విస్ నివాసితులు తమ తోటలు, యార్డులు, పొలాల్లో కాటన్ లోదుస్తులు, టీ బ్యాగ్‌లను పాతిపెడుతున్నారు. జ్యూరిచ్ విశ్వవిద్యాలయం, స్విస్ ఫెడరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆగ్రోస్కోప్ మధ్య సహకార ప్రాజెక్ట్ “ప్రూఫ్ బై అండర్ ప్యాంట్స్”.. స్విట్జర్లాండ్ అంతటా కాటన్ లోదుస్తులను పాతిపెట్టే ఓ వింత ప్రయోగానికి పూనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల భూసారం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.