తిరువూరు : ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్(ఏపియంపిఎ) ద్వారా పాత్రికేయుల సమస్యలు పరిష్కరించుకుందామని యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి చైతన్య పేర్కొన్నా రు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సభా మందిరంలో గురువారం సీనియర్ పాత్రికేయులు మరకాల గోపి అధ్యక్షతన పలు ప్రింట్ అండ్ ఎలక్రాన్ మీడియా మిత్రుల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి చైతన్య తో పాటు ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోషియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.వెంకటరత్నం హాజరయ్యారు. ఈ సందర్బంగా చైతన్య మాట్లాడుతూ దీర్ఘకాళికంగా ఉన్న పాత్రికేయుల సమస్యలు పరిష్కరించుకోవడం కోసం శ్రీరామ్ యాదవ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోషియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు.చిన్నపత్రికలు, పెద్ద పత్రికలు అనే బేధం లేకుండా,అలాగే యూట్యూబ్ ఛానల్స్ నడిపే పాత్రికేయు లకు సైతం ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పించాల్లన్నదే ఏపియంపిఎ ప్రధాన ఉద్దేశమన్నారు.
దీనిలో భాగంగా నవంబర్ 5 వ తేదీ శనివారం విజయవాడలోని చల్లపల్లి బంగ్లా ఐఎంఎ హాలులో జరుగనున్న ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణాజిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయాలని అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి చైతన్య స్థానిక పాత్రికేయులను కోరారు. తిరువూరు పట్టణంలోని పలు ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా పాత్రికేయులను కలిసి ఏపియంపిఎ సర్వసభ్య సమావేశానికి సంబందించినఆహ్వాన పత్రికలను అందజేశారు. తిరువూరు నియోజకవర్గంలో పనిచేస్తున్న పాత్రికేయులు ఈ సమావేశానికి తరలిరావాలని పసుపులేటి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రధానంగా పాత్రికేయ సమస్యలపై చర్చించడం జరుగుతుంద ని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ , రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భాను, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని తెలిపారు.