మోహన్ యాదవ్:
మధ్యప్రదేశ్ లో ఓబీసీ సమస్యను కాంగ్రెస్ పార్టీ నిరంతరం లేవనెత్తుతోంది. మధ్యప్రదేశ్‌కు మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రి చేయడం ద్వారా కాంగ్రెస్‌కు గట్టి సమాధానం ఇవ్వడానికి బీజేపీ ప్రయత్నం చేసింది…మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఓబీసీ ఓటు చాలా ముఖ్యమైనది..
రాజస్థాన్‌లో భజన్‌లాల్:
ఆయన బ్రాహ్మణ సమాజానికి చెందిన నేత. రాష్ట్రంలోని బ్రాహ్మణులే కాకుండా దేశంలోని బ్రాహ్మణ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం..
బ్రాహ్మణుల జనాభా దాదాపు ఏడు శాతం. రాష్ట్రంలోని బ్రాహ్మణులు బీజేపీకే మద్దతుగా ఉన్నారు. వారి పట్టు నిలుపుకునేందుకు బీజేపీ ఎత్తుగడ..
ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన ఓటర్లపై కన్ను:
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ గిరిజన ఓటర్లపై పట్టు పెంచుకునేందుకు విష్ణు దేవ్‌సాయిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన ఓటర్లే నిర్ణయాత్మకం. ఇక్కడి జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మంది గిరిజనులే.
గిరిజన సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసించే జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాలపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.