వామపక్షాలతో పొత్తుపై నేడు తుది నిర్ణయం
ఖమ్మానికి తుమ్మల… పాలేరుకు పొంగులేటి!
న్యూఢిల్లీ : శాసనసభ ఎన్నికలకు సంబంధించి 58 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం అభ్యర్థుల జాబితా విడుదల చేయనుంది. వామపక్షాలతో పొత్తుపై ఆదివారం స్పష్టత రానుంది. అనంతరం మిగతా స్థానాలపై చర్చించి బుధ, గురువారాల్లో రెండో జాబితాను విడుదల చేయనుంది. ఖమ్మం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో దిగనున్నారు. వామపక్షాలతో పొత్తు, ఇతర స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాక్రే, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సుమారు ఆరు గంటలపాటు సమావేశమయ్యారు. మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశమయ్యే పరిస్థితి లేనందున ఈ భేటీలో మరో 22 మంది అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలిసింది. శనివారం నాటి చర్చలో వరంగల్ తూర్పు(కొండా సురేఖ), వరంగల్ పశ్చిమ(నాయిని రాజేందర్‌రెడ్డి), డోర్నకల్-ఎస్టీ(రామచంద్ర నాయక్), మహబూబాబాద్-ఎస్టీ (మురళీ నాయక్), నారాయణ్‌ఖేడ్ (సంజీవరెడ్డి) పేర్లు ఖారారు చేసినట్లు తెలిసింది. ఈ పేర్లను రెండో జాబితాలో విడుదల చేయనున్నట్లు సమాచారం. గతంలోనే 70 స్థానాలపై స్క్రీనింగ్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చినా ఆదివారం 58 మందితోనే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నారు. అందులో మిగిలిన 22, శనివారం చర్చించిన 22 కలిపితే 114 అవుతాయి. వామపక్షాలతో పొత్తుకు సంబంధించి అయిదు స్థానాలను పక్కనపెట్టారు. ఇదే భేటీలో ప్రియాంక, రాహుల్‌గాంధీ పాల్గొననున్న బస్సు యాత్రపైనా చర్చించారు.
సీపీఎం, సీపీఐలకు రెండేసి సీట్ల చొప్పున
వామపక్షాల్లో సీపీఎం భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, సీపీఐ కొత్తగూడెం, మునుగోడు, హుస్నాబాద్‌లను డిమాండ్ చేస్తున్నాయని, అయితే చెరో రెండేసి సీట్లు, ఒక్కో ఎమ్మెల్సీ పదవిపై హామీ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. భద్రాచలంపై సీపీఎం పట్టుదలగా ఉన్నట్లు తెలిసింది. అక్కడ కాంగ్రెస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉండడంతో ఆయనతో ఒకసారి చర్చించి ఆయన పినపాకకు వెళ్లడానికి అంగీకరిస్తే భద్రాచలం సీపీఎంకు కేటాయించవచ్చని భావిస్తున్నారు. ఈ అంశంపై ఎమ్మెల్యే పొదెం వీరయ్య, వామపక్ష నేతలతో ఆదివారం చర్చించనున్నారు. సమావేశం అనంతరం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలతోపాటు తెలంగాణ(58 స్థానాలు)కు సంబంధించిన తొలి జాబితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను వెల్లడిస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయతను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.బుధ, గురువారాల్లో రెండో జాబితా
వామపక్షాలతో పొత్తుపై నేడు తుది నిర్ణయం
ఖమ్మానికి తుమ్మల… పాలేరుకు పొంగులేటి!
న్యూఢిల్లీ : శాసనసభ ఎన్నికలకు సంబంధించి 58 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం అభ్యర్థుల జాబితా విడుదల చేయనుంది. వామపక్షాలతో పొత్తుపై ఆదివారం స్పష్టత రానుంది. అనంతరం మిగతా స్థానాలపై చర్చించి బుధ, గురువారాల్లో రెండో జాబితాను విడుదల చేయనుంది. ఖమ్మం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో దిగనున్నారు. వామపక్షాలతో పొత్తు, ఇతర స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాక్రే, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సుమారు ఆరు గంటలపాటు సమావేశమయ్యారు. మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశమయ్యే పరిస్థితి లేనందున ఈ భేటీలో మరో 22 మంది అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలిసింది. శనివారం నాటి చర్చలో వరంగల్ తూర్పు(కొండా సురేఖ), వరంగల్ పశ్చిమ(నాయిని రాజేందర్‌రెడ్డి), డోర్నకల్-ఎస్టీ(రామచంద్ర నాయక్), మహబూబాబాద్-ఎస్టీ (మురళీ నాయక్), నారాయణ్‌ఖేడ్ (సంజీవరెడ్డి) పేర్లు ఖారారు చేసినట్లు తెలిసింది. ఈ పేర్లను రెండో జాబితాలో విడుదల చేయనున్నట్లు సమాచారం. గతంలోనే 70 స్థానాలపై స్క్రీనింగ్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చినా ఆదివారం 58 మందితోనే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నారు. అందులో మిగిలిన 22, శనివారం చర్చించిన 22 కలిపితే 114 అవుతాయి. వామపక్షాలతో పొత్తుకు సంబంధించి అయిదు స్థానాలను పక్కనపెట్టారు. ఇదే భేటీలో ప్రియాంక, రాహుల్‌గాంధీ పాల్గొననున్న బస్సు యాత్రపైనా చర్చించారు.
సీపీఎం, సీపీఐలకు రెండేసి సీట్ల చొప్పున
వామపక్షాల్లో సీపీఎం భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, సీపీఐ కొత్తగూడెం, మునుగోడు, హుస్నాబాద్‌లను డిమాండ్ చేస్తున్నాయని, అయితే చెరో రెండేసి సీట్లు, ఒక్కో ఎమ్మెల్సీ పదవిపై హామీ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. భద్రాచలంపై సీపీఎం పట్టుదలగా ఉన్నట్లు తెలిసింది. అక్కడ కాంగ్రెస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉండడంతో ఆయనతో ఒకసారి చర్చించి ఆయన పినపాకకు వెళ్లడానికి అంగీకరిస్తే భద్రాచలం సీపీఎంకు కేటాయించవచ్చని భావిస్తున్నారు. ఈ అంశంపై ఎమ్మెల్యే పొదెం వీరయ్య, వామపక్ష నేతలతో ఆదివారం చర్చించనున్నారు. సమావేశం అనంతరం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలతోపాటు తెలంగాణ(58 స్థానాలు)కు సంబంధించిన తొలి జాబితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను వెల్లడిస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయతను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.