న్యూఢిల్లీ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో
దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మెన్షన్
చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యవహారమని, అక్కడ ప్రతిపక్షాలను
అణచివేస్తున్నారని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్ద లూథ్రా
ప్రస్తావించారు. ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ అడగగా ఈనెల 8న
అరెస్ట్ చేశారని న్యాయవాది తెలిపారు. దీంతో మంగళవారం మెన్షన్ లిస్ట్
ద్వారా రావాలని సిద్ధార్థ లూథ్రాకు సీజేఐ సూచించారు. ఏపీ స్కిల్
డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు
చేస్తూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.