న్యూఢిల్లీ : ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియాకు కొత్త జట్టు ఎన్నికైంది. నిన్న
ఎన్నికలు జరగ్గా ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు.
ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియాకు కొత్త టీమ్ ఎన్నికైంది. అధ్యక్ష, ఉపాధ్యక్షుడు
సహా పలు పదవులకు శనివారం నిర్వహించిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి.
ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా గౌతమ్ లహిరి ఎన్నికయ్యారు.
అధ్యక్ష పదవికి గౌతమ్ లహిరితో పాటు ప్రశాంత్ టాండన్ పోటీ పడగా గౌతమ్‌కు 861
ఓట్లు రాగా టాండన్‌కు 277 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే, ప్రెస్‌క్లబ్ ఆఫ్
ఇండియా ఉపాధ్యక్షుడిగా మనోరంజన్ భారతి, సెక్రటరీ జనరల్‌గా నిరజ్ ఠాకూర్,
సంయుక్త కార్యదర్శిగా మహ్మద్ మహ్తాబ్ ఆలం ఎన్నికయ్యారు. అలాగే,
ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియాలో కోశాధికారి పదవికి ముగ్గురు పోటీపడగా మోహిత్
దుబే విజయం సాధించారు. దీంతో పాటు మేనేజింగ్ కమిటీకి 16మంది సభ్యులు
ఎన్నికయ్యారు. వీరిలో అనిశ్ కుమార్, అష్రాఫ్ అలీ, అసీష్ గుప్తా, జితిన్
గాంధీ, మన్వీందర్ వశిష్ఠ్, మయాంక్ సింగ్, మేఘన ధూలియా, మహ్మద్ అబ్దుల్
బారి మసౌద్, నళినీ రంజన్ మహంతి, ప్రజ్ఞాసింగ్, రవీందర్ కుమార్, శంకర్
కుమార్ ఆనంద్, సునీల్ నేగి, సురభి కంగ, తేలప్రోలు శ్రీనివాసరావు, వినీత
ఠాకూర్ ఉన్నారు.