న్యూఢిల్లీ : వ్యవస్థలను వివస్త్రలుగా చేసి సీఎం జగన్ ఆడుకుంటున్నారని వైసీపీ
ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. పదేళ్ల క్రితం సెప్టెంబరు 23వ తేదీన రూ.
43 వేల కోట్ల అవినీతి నేరాభియోగ కేసుల్లో జైలు నుంచి బెయిల్పై విడుదలైన
రోజును పండుగలా జరుపుకోవడంలో తప్పులేదని ఎద్దేవా చేశారు. ఆయన ఢిల్లీలో
విలేకరులతో మాట్లాడుతూ చట్టం అందరికీ సమానమని అంటారని, అయితే, ఆ చట్టానికి
అతీతుడని జగన్ నిరూపించారని విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐ
కోర్టుకు విచారణకే హాజరుకావలసిన అవసరం లేదన్నట్లుగా అద్భుతమైన ఉత్తర్వులు
తెచ్చుకున్న ఘనుడు జగన్ అన్నారు. వ్యవస్థలను జగన్ మేనేజ్ చేస్తున్నారని
ఆక్షేపించారు.