4 బంగారు ఉంగరాలు తప్పితే ఇతర స్థిరాస్తులేమీ లేవు
గాంధీనగర్ ఎస్బీఐ బ్రాంచ్‌లోనే 95% డిపాజిట్లు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం ఆస్తి విలువ రూ.2,58,96,444. మార్చి
31తో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన సమర్పించిన ఆస్తి,
అప్పుల పట్టి ఈ విషయాన్ని వెల్లడించింది. గతేడాది నాటి ఆస్తి విలువ
రూ.2,23,82,504 పోలిస్తే ఇందులో రూ.35,13,940 (15.69%)పెరుగుదల కనిపించింది.
ఆయన పేరున కొంత నగదు, బ్యాంకులో ఫిక్స్డ్, మల్టీఆప్షన్ డిపాజిట్లు, నేషనల్
సేవింగ్ సర్టిఫికెట్లు, 4 బంగారు ఉంగరాలు తప్పితే ఇతర స్థిర, చరాస్తులేవీ
లేవు. గతేడాది ఎల్ఐసీ పాలసీలు చూపినా ఈ సారి వాటి గురించి చెప్పలేదు. ఆయన
ఆస్తుల్లో 95.55% గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఎస్బీఐ ఎన్ఎస్సీ బ్రాంచ్‌లో
ఎఫ్డీఆర్, ఎంఓడీల రూపంలోనే ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే దీని విలువలో
17.64% వృద్ధి నమోదైంది. అదే ఎస్బీఐలోని మరో ఖాతాలో నగదు నిల్వ రూ.46వేల
నుంచి మినిమమ్ బ్యాలెన్స్ స్థాయి (రూ.574)కి తగ్గిపోయింది. ఆయన డిపాజిట్లు,
పోస్టల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ విలువ ఈసారి పెరిగింది. సతీమణి జసోదాబెన్
పేరున ఉన్న ఆస్తి వివరాలు తెలియవని మోడీ పేర్కొన్నారు.