న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
తొలి రోజు సమావేశాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ లో
ప్రసంగించనున్నారు. అయిదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పార్లమెంటు 75ఏళ్ల
ప్రస్థానంపై చర్చలతోపాటు నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం
వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ చర్చను ప్రధాని నరేంద్ర మోడీ
ప్రారంభించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో
ప్రశ్నోత్తరాలు, శూన్యగంట వంటివి ఉండబోవని కేంద్రం ఇదివరకే ప్రకటించింది.

దీంతో ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ప్రారంభం కాగానే లోక్సభలో ప్రధాని మోదీ
చర్చను ప్రారంభించనున్నారు. ‘‘రాజ్యాంగ పరిషత్తు ఆవిర్భావం నుంచి 75 ఏళ్లలో
పార్లమెంటు ప్రస్థానం, విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు’’ అంశంపై ప్రధాని
ప్రసంగించనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. మోడీ తర్వాత పలువురు
కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతల సభ్యులు కూడా ఈ చర్చలో పాల్గొని తమ అనుభవాలను
పంచుకోనున్నారు. సోమవారం నాటి సమావేశం పార్లమెంట్ పాత భవనంలో జరగనుంది.
మంగళవారం నుంచి నూతన భవనంలో సమావేశాలు కొనసాగనున్నాయి.