నీతిపరులను అవినీతిపరులు జైలుకు పంపుతున్నారు
చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకే ఢిల్లీ వచ్చా
జాతీయ మీడియాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
న్యూఢిల్లీ : విజయవాడలో విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గమని టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ‘‘చంద్రబాబు అక్రమ
అరెస్టుకు నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేయాలనుకున్న విజయవాడలోని వివిధ
కళాశాలల విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గం. కళాశాలల్లోకి పెద్దఎత్తున
పోలీసులు చొరబడటం ఎమర్జెన్సీని తలపిస్తోంది. తరగతులు సస్పెండ్ చేయించి,
కళాశాలలకు పోలీసులే సెలవు ప్రకటించడం వెనుక సైకో జగన్ సర్కారు ఆదేశాలే కారణం.
నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉద్ధృతం అవుతుందని గుర్తుంచుకోండి సైకో
పాలకులారా’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
ఎలాంటి స్కామ్ జరగలేదని నిరూపిస్తా : వైసీపీ ప్రభుత్వం కావాలని తప్పుడు
కేసులో చంద్రబాబును ఇరికించిందని టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా
లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకే ఢిల్లీ
వచ్చినట్టు తెలిపారు. ‘‘అనినీతి పరులు నీతిపరులను జైలుకు పంపుతున్నారు.
‘స్కిల్ డెవలప్మెంట్’ అంశంలో అవినీతి నిరూపించలేకపోయారు. చంద్రబాబుకు డబ్బు
అందిందని నిరూపించలేకపోయారు. ఎలాంటి స్కామ్ జరగలేదని నేను నిరూపించగలను.
అన్ని పత్రాలు చూపించి అవినీతి జరగలేదని నిరూపిస్తా. అపరిమిత అధికారం అపరిమిత
అవినీతికి దారి తీస్తుందని లోకేశ్ ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకే ఢిల్లీ వచ్చా: నీతిపరులను
అవినీతిపరులు జైలుకు పంపుతున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడ్ని
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో, పార్టీ జాతీయ
ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ వచ్చారు. దేశ రాజధానిలో ఆయన ఈ సాయంత్రం
జాతీయ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి
చెప్పేందుకే తాను ఢిల్లీ వచ్చానని స్పష్టం చేశారు. చంద్రబాబు పట్ల ఎలా
వ్యవహరించారో దేశ ప్రజలకు వివరిస్తానని తెలిపారు. నీతిపరులను అవినీతి పరులు
జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అపరిమిత అధికారం అవినీతికి
దారితీస్తుందని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ అంశంలో ఆరోపణలు అయితే చేశారు
కానీ, అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారని లోకేశ్ వెల్లడించారు.
చంద్రబాబుకు డబ్బు అందిందని నిరూపించలేకపోయారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం
కావాలనే చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించిందని అన్నారు. ఎలాంటి కుంభకోణం
జరగలేదని నేను నిరూపించగలను అని సవాల్ విసిరారు. అన్ని పత్రాలు చూపించి
అవినీతి జరగలేదని నిరూపిస్తా అని స్పష్టం చేశారు. చంద్రబాబుకు గానీ, మాకు గానీ
ఎలాంటి డబ్బు అందినట్టు, మా ఖాతాల్లోకి నగదు బదిలీ అయినట్టు సీఐడీ వాళ్లు
ఏమైనా నిరూపించగలిగారా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో మేం ఎలాంటి
తప్పిదానికి పాల్పడలేదని దీన్నిబట్టే అర్థమవుతోందని లోకేశ్ వివరించారు. న్యాయం
కొద్దిగా ఆలస్యం కావొచ్చేమో కానీ, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికొస్తారని
ధీమా వ్యక్తం చేశారు.