భారతదేశాన్ని రక్తమోడించాలనే లక్ష్యంతో ఉగ్రవాద కుట్రలు పన్నుతున్న పాకిస్థాన్ దుష్ట ప్రయత్నాలను భారత పోలీసులు బయటపెట్టారు. భారత దేశంలోకి ఏ విధంగా చొరబాట్లకు పాల్పడాలో పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం కలిసి సమన్వయంతో రూపొందించిన ఉగ్రవాద మాడ్యూల్‌ను ఛేదించినట్లు పోలీసులు ఆదివారం పేర్కొన్నారు. జమ్మూలో పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న డ్రోన్ల ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేయడంలో పాల్గొన్న ఇద్దరు సభ్యులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆర్ఎస్ పురాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న బాస్పూర్ బంగ్లా ప్రాంతంలో డ్రోన్ల ద్వారా ఆయుధాలను పడవేయడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్టుబడ్డ వారి నుంచి నాలుగు పిస్టల్స్, ఎనిమిది మ్యాగజైన్లు, 47 రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముఖేష్ సింగ్ తెలిపారు.