విజయవాడ నుంచి షార్జాకు నేరుగా విమాన సర్వీసు సోమవారం నుంచి ప్రారంభమవుతుందని మచిలీపట్నం ఎంపీ, ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వి.బాలసోరి తెలిపారు. విజయవాడ-షార్జా మధ్య డైరెక్ట్ విమా న సర్వీసు ఈ నెల 31న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ విమాన సర్వీసు ప్రారంభిస్తోంది. ఆ రోజు సాయంత్రం 6.35 గంటలకు విజయవాడ-షార్జా తొలి విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. రూ.13,669 ప్రారంభ ధరతో ఈ సర్వీసు ప్రారంభిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది. కాగా షార్జా-విజయవాడ సర్వీసు చార్జీ 399 ఎమిరేట్స్ దిర్హమ్స్ (సుమారు రూ.8,946)గా నిర్ణయించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యంగా దుబాయ్, నార్త్రన్ ఎమిరేట్స్ వెళ్లే ప్రయాణికులకు విజయవాడ-షార్జా డైరెక్ట్ విమాన సర్వీసు అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ తెలిపారు.