అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని నరేంద్ర మోడీ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరువురు నేతలు పలు అంశాలపై
ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో
బైడెన్ ప్రధాని నరేంద్ర మోడీ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అధ్యక్షుడిగా
బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్‌కు వచ్చిన బైడెన్ విమానాశ్రయం నుంచి
నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లారు. బైడెన్‌కు మోడీ ఘన స్వాగతం పలికారు.
ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరువురు నేతలు పలు అంశాలపై
చర్చించినట్లు సమాచారం.
జేఈ జెట్ ఇంజిన్ ఒప్పందం, అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు, 5జీ-
6జీ స్పెక్ట్రమ్, క్లిష్టమైన అధునాతన సాంకేతికతల అభివృద్ధికి పరస్పర సహకారం,
అణురంగంలో పురోగతి తదితర అంశాలపై ఇద్దరు నేతలు కూలంకషంగా చర్చించనున్నట్లు
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ ఇదివరకే మీడియాకు వెల్లడించారు.
ద్వైపాక్షిక భేటీ పూర్తయిన తర్వాత ఐటీసీ మౌర్యలో జో బైడెన్ బస చేయనున్నారు.
మారిషస్ ప్రధానితో నరేంద్ర మోడీ భేటీ
అంతకుముందు మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ
అయ్యారు. కీలక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చలు జరిపారు. మారిషస్ ప్రధానితో
చాలా మంది సమావేశం జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
భారత్-మారిషస్ మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయినందున ఇరు దేశాల
ద్వైపాక్షిక సంబంధాలకు ఇది ప్రత్యేక సంవత్సరమని ప్రధాని అన్నారు. మౌలిక
సదుపాయాలు, ఫిన్‌టెక్, సంస్కృతి సహా కీలక రంగాల్లో సహకారంపై చర్చలు జరిపినట్లు
నరేంద్ర మోడీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దక్షిణ దేశాల గొంతుకను మరింత బలంగా
వినిపించాలని, ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు ప్రధాని తెలిపారు.