జమిలి ఎన్నికలపై కసరత్తు షురూ : ప్రజలకు ఒరిగేదేంటని విపక్షాల ప్రశ్న
న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం
ఏర్పాటు చేసిన ‘కమిటీ’ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో
తొలిసారిగా సమావేశమైంది. ఢిల్లీలో రామ్నాథ్ ఇంట్లో సమావేశం జరిగింది.
జమిలి ఎన్నికలపై కసరత్తు షురూ : ప్రజలకు ఒరిగేదేంటని విపక్షాల ప్రశ్న
జమిలి ఎన్నికల అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ పని
ప్రారంభించింది. ఈ మేరకు కమిటీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ
జమిలి ఎన్నికలను రాష్ట్రాలపై దాడిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
అభివర్ణించారు. ఇక దీంతో ప్రజలకు ఒరిగేదేంటని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ప్రశ్నించారు.