మండిపడుతున్న వివిధ వర్గాలు
మైనారిటీల ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని కించపరుస్తారా అంటూ స్వరూపానంద ఆగ్రహం
వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్
సనాతన ధర్మాన్ని కరోనా, డెంగీ, మలేరియా వంటి ప్రమాదకర జబ్బులతో పోల్చిన
తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై విమర్శల జడివాన
కురుస్తోంది. తాజాగా ఉదయనిధి వ్యాఖ్యలపై శారదా పీఠాధిపతి స్వామి
స్వరూపానందేంద్ర మండిపడ్డారు. మైనారిటీల ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని కించపర్చడం
నీచమైన చర్య అని విమర్శించారు. “నీ తల్లి దుర్గా మాత ఆలయాలను
దర్శించుకుంటుంది. ధర్మాన్ని విమర్శిస్తే నీ తల్లిని దూషించినట్టే” అని
స్వరూపానందేంద్ర స్పష్టం చేశారు. ఉదయనిధికి రాజకీయ జీవితం లేకుండా శపించాలని
తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి తాను చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి
తీసుకోవాలని, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.