న్యూ ఢిల్లీ : పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 22వరకు ఐదు
రోజులపాటు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్
జోషి వెల్లడించారు. జీ 20 సదస్సు ముగిసిన తర్వాత జరిగే ఈ సమావేశాల అజెండా
ఏంటనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు.
‘పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 22వరకు ఐదు రోజులపాటు
జరగనున్నాయి. అమృత్ కాల్ వేళ ఈ పార్లమెంటు సమావేశాల్లో చర్చలు ఫలప్రదంగా
జరగాలని ఆశిస్తున్నాం’ అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి
పేర్కొన్నారు. ప్రస్తుత 17వ లోక్సభ 13వ సారి సమావేశమవుతుండగా రాజ్యసభకు
మాత్రం ఇది 261వ సమావేశం. ఈ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటన్న విషయంపై స్పష్టత
లేనప్పటికీ పార్లమెంటు కొత్త భవనంలోకి మారేందుకే ఈ భేటీ అని ఊహాగానాలు
వినిపిస్తున్నాయి. ఈ సమావేశాలు పాత భవనంలో మొదలై కొత్త భవనంలో ముగుస్తాయని
సమాచారం. వీటితోపాటు జీ20 సదస్సులో కీలక చర్చలు, జమ్మూకశ్మీర్లో వీలైనంత
త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ ప్రత్యేక
సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.