ప్రత్యేకమని, రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని రాష్ట్రపతి
ద్రౌపదీముర్ము అన్నారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని
కొనియాడారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100
స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక
కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ
కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఎన్టీఆర్ నటన అద్భుతమని కొనియాడారు. సామాజిక
న్యాయం కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ విలక్షణ వ్యక్తిత్వాన్ని
ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పారు.
ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ
ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరని చెప్పారు. మహిళకు ఆస్తిలో హక్కు
కల్పించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తిరుపతిలో మహిళా వర్సిటీ ఏర్పాటు
చేశారన్నారు. ఎన్టీఆర్ ఒకతరం హీరో మాత్రమే కాదని.. అన్ని తరాలకు ఆదర్శ హీరో
అని పురందేశ్వరి కొనియాడారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన తనదైన ముద్ర
వేశారన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ
అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ తనయులు
నందమూరి బాలకృష్ణ, మోహనకృష్ణ, రామకృష్ణ, కుమార్తెలు పురందేశ్వరి, భువనేశ్వరితో
పాటు ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. వీరితో పాటు టీడీపీ ఎంపీలు కనకమేడల
రవీంద్రకుమార్, కింజరాపు రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని,
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, మాజీ ఎంపీలు సుజనా
చౌదరి, కంభంపాటి రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్కు సినీ,
రాజకీయ రంగాల్లో సన్నిహితంగా మెలిగిన మరికొంతమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.