గోపాలపూర్ : ఒడిశా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పూరీ
శ్రీక్షేత్రాన్ని దర్శించారు. శ్రీక్షేత్రంలో స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం స్వాతంత్య్ర సంగ్రామంలో అమరుడైన విప్లవ (పైకా) వీరుడు రాజగురు
స్వగ్రామం బీర హరేకృష్ణపూర్ను సందర్శించారు. రాజగురు విగ్రహానికి
పుష్పగుచ్ఛాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల స్మృతి పీఠాన్ని
ఆవిష్కరించారు. ఆ తర్వాత తలపై అమృత కలశం పెట్టుకొని గ్రామంలో అమరవీరుల వంశీకుల
ఇళ్లకు వెళ్లి మట్టి సేకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె
మాట్లాడుతూ అమరవీరుల గ్రామాల నుంచి మట్టి సేకరించి ఢిల్లీలో ‘అమృత వాటికా’
నిర్మాణం చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని చెప్పారు. ఇదే గ్రామం నుంచి మరో
అయిదుగురు స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలు వదిలారని గుర్తుచేశారు.