న్యూఢిల్లీ : ‘మోదీ ఇంటి పేరు’పై వ్యాఖ్యలకు నమోదైన పరువు నష్టం కేసులో తనకు
విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
గాంధీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 21న వాదనలు
వింటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్
పి.ఎస్.నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో
సూరత్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు
శిక్షను నిలిపివేయాలన్న రాహుల్ అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు ఇటీవల
తోసిపుచ్చింది. కింది కోర్టు శిక్ష విధించడం సరైనదేనని తెలిపింది. దీంతో ఆ
తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి సీజేఐ జస్టిస్
డి.వై.చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ కేసు విషయాన్ని ప్రస్తావించగా 21న విచారణ
చేపట్టేందుకు అంగీకరించారు.