బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న లక్ష్యంతో విపక్షాలు
ఏకమవుతున్నాయి. ఇందుకు సంబంధించి బెంగళూరులో రెండో రోజూ విపక్షాల సమావేశం
జరగనుంది. ఇటీవల పట్నాలో తొలి విడత సమావేశంలో పాల్గొన్న విపక్ష నేతలు రెండో
విడతగా సోమవారం బెంగళూరులో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన
ఈ సమావేశానికి ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ మినహా ఆహ్వానాలు అందుకున్న మిగతా
విపక్ష నేతలంతా హాజరయ్యారు. రెండోరోజు సమావేశాల్లో లాంఛనప్రాయమైన చర్చలకు
ఎజెండాగా ఏయే అంశాలు ఉండాలనేది నేతలు తొలిరోజు భేటీలో స్థూలంగా
మాట్లాడుకున్నారు. కాగా, రెండో రోజు సమావేశానికి ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్
హాజరవుతున్నారు. ఆయన ఇప్పటికే ముంబయి చేరుకున్నారు. కాసేపట్లో చర్చలు ప్రారంభం
కానున్నాయి. కాగా.. విపక్షాల కూటమిలో యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీకి కీలక
బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.