లఖ్నవూ : గతంలో మన వాణిని ప్రపంచ దేశాలు అంత సీరియస్గా తీసుకునేవి కావని,
కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తోందని రక్షణశాఖ మంత్రి
రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రతిష్ఠ
అంతర్జాతీయ వేదికలపై పెరిగిందని లఖ్నవూలో ఆయన వ్యాఖ్యానించారు. తన సొంత
నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన కోసం ఆయన లఖ్నవూ వచ్చారు. ‘మన ప్రధాన మంత్రి
విదేశాలకు వెళ్లినప్పుడు ఆయనకు ఎలా స్వాగతం పలుకుతున్నారో టీవీల్లో
చూస్తున్నాం. మోదీని బాస్ అని ఆస్ట్రేలియా ప్రధాని పిలుస్తారు. మోదీజీ..మీరు
అంతర్జాతీయ శక్తి అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంటారు. ఆయన ఆటోగ్రాఫ్
తీసుకుంటారు. ముస్లిం దేశాలూ మోదీకి అపార గౌరవం ఇస్తాయి. పపువా న్యూగినియా
ప్రధాని ఏకంగా మోదీ పాదాలను తాకారు’ అని రాజ్నాథ్ పేర్కొన్నారు.

లఖ్నవూలో బ్రహ్మోస్ తయారీ : బ్రహ్మోస్ క్షిపణులను లఖ్నవూలో తయారు
చేయనున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. విదేశాల్లో పని చేస్తున్న భారతీయ
ఇంజినీర్లూ ఇందులో పాలుపంచుకోనున్నారని చెప్పారు. క్షిపణుల తయారీతో స్థానికంగా
పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని, క్షిపణులను తరలించడానికి ప్రత్యేక రైల్వే
లైను నిర్మించనున్నామని తెలిపారు.