కాంగ్రెస్ అధికారిక ప్రకటన
మే 20న ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఎంపికయ్యారు. డీకే
శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి
ఎంపికలో ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్
సీనియర్ నేత సిద్ధరామయ్యను రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఇక
డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ను ఖరారు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై నిన్న
అర్ధరాత్రి తర్వాత పార్టీలో ఏకాభిప్రాయం కుదిరింది. అనంతరం గురువారం మధ్యాహ్నం
పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్
రణ్‌దీప్ సూర్జేవాలా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏఐసీసీ నిర్ణయాన్ని
ప్రకటించారు. ఈ సందర్భంగా కె.సి.వేణుగోపాల్ మాట్లాడుతూ కర్ణాటక విజయం
కాంగ్రెస్‌కు ఉత్సాహాన్ని నింపిందని, ఇందుకోసం పార్టీ హైకమాండ్‌తో పాటు
నేతలంతా కృషి చేశారని, మాది ప్రజాస్వామ్య పార్టీ. నియంతృత్వం కాదు..
ఏకాభిప్రాయాన్ని నమ్ముతామని కర్ణాటక కాంగ్రెస్‌కు నేతలు ఈ నెల 14న కర్ణాటక
శాసనసభ సమావేశాన్ని నిర్వహించి సీఎం ఎవరనే అంశంపై ఎమ్మెల్యే అభిప్రాయాన్ని
సేకరించి తర్వాత సీఎంగా సిద్ధరామయ్య పేరును ఖరారు చేశారు. డీకే శివకుమార్ ఉప
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదే కాకుండా రాష్ట్ర పీసీసీ అధ్యక్ష
బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల వరకు
డీకే ఈ బాధ్యతల్లో కొనసాగుతారు.
మే 20న ప్రమాణ స్వీకారం : బెంగళూరులో గురువారం రాత్రి కాంగ్రెస్ శాసనసభా పక్ష
సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు
అధికారికంగా ఎన్నుకోనున్నారు. తమ నిర్ణయాన్ని గవర్నర్‌కు సమర్పిస్తామని
కాంగ్రెస్ తెలిపింది. మే 20న కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప
ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు.
సోనియా బుజ్జగింపుతో : సీఎం పదవి కోసం సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే
శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్ కు
కష్టతరంగా మారింది. ఈ క్రమంలో సుధీర్ఘ చర్చలు జరిపిన పార్టీ హైకమాండ్
సిద్ధరామయ్య సీఎంగా మొగ్గుచూపింది. అయితే ఇందుకు అంగీకరించని డీకే శివకుమార్
ముందుగా తన పంతం కొనసాగించారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాటే వరకు ఏఐసీసీ
అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇరువర్గాలతో వరుస చర్చలు జరిపారు. కాంగ్రెస్
నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా డీకేతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం
పదవిని చేపట్టేందుకు శివకుమార్‌ను సోనియా బుజ్జగించినట్లు పార్టీ వర్గాలు
పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో
ఉంచుకుని పార్టీ ప్రయోజనాల కోసం బోర్డు నిర్ణయాన్ని అంగీకరించినట్లు డీకే
శివకుమార్ ఈ సందర్భంగా తెలిపారు. తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.